- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ షాక్.. 27న విచారణకు రావాలని నోటీసులు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏపీ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 27న విచారణకు రావాలని పేర్కొంది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడిపై వరుస విమర్శలు, ఫిర్యాదులు చేసిన మంగళగిరి మాజీమంత్రి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ అధికారులు షాకిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అసైన్డ్ భూముల వ్యవహారంలో చేసిన ఫిర్యాదులపై సరైన సాక్ష్యాధారాలు లేవని ఏపీ సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. సాక్ష్యాలు లేకపోతే కేసును ఎందుకు మూసివేయకూడదే వివరణ ఇవ్వాలని పేర్కొంటూ.. ఏపీ ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంటికి నోటీసులు పంపారు. ఈనెల 27వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలను చూపించలేని పక్షంలో కేసు బలహీనపడుతుంది. రాజధాని ప్రాంతంలో కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆళ్ల నాని.. కోర్టుబోనులో ఎలాంటి సమాధానం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లి మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. జగన్ పై అసంతృప్తితో షర్మిలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన.. లోకేశ్ ను ఓడించేందుకు మళ్లీ వైసీపీతో చేయి కలిపారు. మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిని చవిచూసిన తర్వాత పెద్దగా మీడియాలో కనిపించలేదు. ఈనెల 27న విచారణ నేపథ్యంలోనైనా ఆయన మీడియాకు తారసపడతారేమో చూడాలి. మరోవైపు ఆళ్లనాని సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డ పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది.






