వచ్చే నెల 9 వరకు APPSC చైర్‌పర్సన్‌గా అనురాధ.. పదవీ విరమణపై ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC)ని గాడిన పెట్టేందుకు గతంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ బాధ్యతలను సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టింది.

వచ్చే నెల 9 వరకు APPSC చైర్‌పర్సన్‌గా అనురాధ.. పదవీ విరమణపై ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC)ని గాడిన పెట్టేందుకు గతంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ బాధ్యతలను సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టింది. ఏ మేరకు గతేడాది అక్టోబర్ 23న ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ (AR Anuradha)ను ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌ను నియమించింది. అయితే, ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ (Intelligence) విభాగానికి అధిపతిగా పనిచేసి మంచి అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో విధులు నిర్వర్తించారు. అయితే, తాజాగా ఆమె ఆ పదవి విరమణపై వార్తలు వస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే నెల 9 వరకు ఏఆర్ అనురాధ ఏపీపీఎస్సీ (APPSC) చైర్ పర్సన్‌గా పదవిలో కొనసాగుతారని స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇవాళ అధికారిక ఉత్తర్వుల జారీ చేశారు.

Next Story