- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌పై జోకులు: స్టాండప్ కమెడియన్ అనుదీప్‌కు ఊరట
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టైన ప్రముఖ స్టాండప్ కమెడియన్ అనుదీప్‌కు బెయిల్ మంజూరు అయింది...

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ స్టాండప్ కమెడియన్ అనుదీప్(stand up comedian Anudeep)ను కాకినాడ వన్ టౌన్ పోలీసులు(Kakinada One Town Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు అయింది. రూ. 10 వేల సొంత పూచికత్తుపై ధర్మాసనం అనుదీప్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల అయ్యారు.
పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు
కాగా ఒక ప్రదర్శనలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అనుదీప్ వేసిన జోకులు వివాదాస్పదం అయ్యాయి. దీంతో జనసేన నేత బడే వెంకట కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుదీప్‌పై BNS సెక్షన్లు 356(2), 353(2), 79 తో పాటు IT యాక్ట్ 67 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి అనుదీప్‌ను కాకినాడ 3వ అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మసనం అనుదీప్‌కు ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేసింది.






