ఒక ప్రత్యేకమైన సీన్ మధ్యలో.. వెంకీ, త్రివిక్రమ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

by Chukka Sudharani |   (  Updated:2026-04-17 10:25:33  IST  )

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శకుటుంబం’ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఒక ప్రత్యేకమైన సీన్ మధ్యలో.. వెంకీ, త్రివిక్రమ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
X

దిశ, సినిమా : యువ హీరోలకు పోటీగా విక్టరీ వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన ఈయన.. ఇప్పుడు అనీల్ రావిపూడితో మరో ప్రాజెక్టు చేస్తున్నాడు. దీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌గా తెరకెక్కుతోన్న ‘ఆదర్శకుటుంబం’ చిత్రానికి సంబంధించి షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ఆదర్శకుటుటంబం షూటింగ్ జరుగుతున్నది.. ఒక ప్రత్యేకమైన సీన్ మధ్యలో’ అంటూ ఓ ఫొటో షేర్ చేయగా.. అందులో రైల్వే స్టేషన్‌లో వెంకటేష్ ఉండగా డైరెక్టర్ త్రివిక్రమ్ సీన్ ఎక్స్‌ప్లేన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నది. కాగా.. నువ్వు నాకు నచ్చావ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ చాలా కాలానికి త్రివిక్రమ్, వెంకటేష్ కలయికలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండగా.. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

నిఖిల్ 'స్వయంభు'.. మామూలు రన్ టైమ్ కాదుగా?

Next Story