- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్వేదిలో అసలు ఏం జరగబోతుంది..? బిక్కుబిక్కుమంటున్న స్థానికులు
ఉవ్వెత్తున ఎగసి పడే అలలు, పర్యాటకులతో సందడిగా ఉండే సంద్రం వద్ద భయానక వాతావరణం నెలకొంది. సముద్రం అరకిలోమీటర్ వెనక్కి వెళ్లడంతో..

దిశ, వెబ్‌డెస్క్: ఉవ్వెత్తున ఎగసి పడే అలలు, పర్యాటకులతో సందడిగా ఉండే సంద్రం వద్ద భయానక వాతావరణం నెలకొంది. సముద్రం అరకిలోమీటర్ వెనక్కి వెళ్లడంతో.. తీరంలో అడుగు పెడితే కాలు మోకాలి లోతు జిగట మట్టిలో కూరుకుపోతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది పేరు వినగానే.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు.. అక్కడున్న సముద్రం కూడా గుర్తొస్తుంది. సముద్రంలో గోదావరి వశిష్ఠ నది కలిసే పుణ్య ప్రదేశం అంతర్వేది. అందుకే పుణ్యక్షేత్రంగా, పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ధి చెందింది.
కానీ.. అంతర్వేది తీరంలో సముద్రం 500 మీటర్లు (అరకిలోమీటర్ ) వెనక్కి వెళ్లింది. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి తిథులలో సముద్రం ఆటుపోట్లకు గురవుతుందంటుంటారు. కానీ.. ఆ తిథులు సమీపంలో లేకపోయినా సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో ఏదో ప్రమాదం రాబోతుందంటూ గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. తీరంలో అడుగుపెడితే మోకాలి లోతు ఒండ్రుమట్టిలోకి కూరుకుపోతుందని తెలిపారు. సముద్రం ఇలా వెనక్కి వెళ్తే.. సునామీ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో వారి భయం మరింత రెట్టింపయింది. ఒక్కో సందర్భంలో లో టైడ్ వల్ల కూడా సముద్రం వెనక్కి వెళ్లవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇది సుమారు 5 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చంటున్నారు. మాన్సూన్ సీజన్ లో సముద్రం ఇలా వెనక్కి వెళ్లడం సహజమేనని, ఖచ్చితంగా సునామీ వస్తుందని చెప్పలేమన్నారు.






