- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడి సూసైడ్
లోన్ యాప్ వేధింపులు భరించలేక మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మచిలీపట్నంలో వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కాసానిగూడెంకు చెందిన గిరీష్ (25).. ఇటీవల వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఓ యాప్ లో లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత వేధింపులు మొదలవ్వడంతో.. వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గిరీష్ స్థానికంగా ఉన్న బెల్ కంపెనీలో సెక్యూరిటీగా ఉద్యోగం చేస్తున్నాడని బంధువులు తెలిపారు. ప్రైవేటు యాప్స్ ద్వారా ఇష్టానుసారంగా లోన్లు ఇచ్చి, తిరిగి చెల్లించేంత వరకూ వేధించడం ఎక్కువగా ఉందని బంధువులు వాపోయారు. క్రమం తప్పకుండా లోన్ రీపేమెంట్ చేస్తున్నా.. ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. లోన్ ఇచ్చిన కంపెనీ ఎక్కడ ఉందో కూడా తెలీదన్నారు. నిన్న కూడా గిరీష్ సోదరి బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకొచ్చిందని తెలిపారు. ఇలాంటి లోన్ యాప్స్ ను ప్రభుత్వం బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. మృతుడి కుటుంబాన్ని పేర్ని కిట్టు పరామర్శించారు.






