- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన ఎమ్మెల్యే బాధితురాలు మరో వీడియో విడుదల.. టీడీపీ నేతల తీవ్ర ఆగ్రహం
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు వ్యతిరేకంగా బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియోను విడుదల చేయడం సంచలనంగా మారింది...

దిశ, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Jana Sena MLA Arava Sridhar)కు వ్యతిరేకంగా బాధితురాలు హర్షవీణ(Victim Harshaveena) తాజాగా మరో వీడియోను విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియోలో ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయన చెప్పిన పనులు ఏనాడూ చేయలేదంటూ ఏకవచనంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముస్లిం మహిళలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయిన నేపథ్యంలో ఈ కొత్త వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ (Tdp) మైనార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి, మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే జనసేన పార్టీ నుంచి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ మైనార్టీ నాయకులు పెనగలూరు పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.






