ఈ సారి అసెంబ్లీలో! వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మరో వీడియో

by Ramesh Naini |   (  Updated:2026-01-30 16:39:13  IST  )

జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వస్తున్న ఆరోపణల పరంపరలో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది.

ఈ సారి అసెంబ్లీలో! వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మరో వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వస్తున్న ఆరోపణల పరంపరలో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించి లైంగిక ఆరోపణలు చేసిన ప్రభుత్వ మహిళా ఉద్యోగి వీణ రోజుకో వీడియో, చాటింగ్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే శ్రీధర్, వీణ మధ్య వీడియో కాల్, చాటింగ్ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. అసెంబ్లీలో ఉన్న సమయంలో వీడియో కాల్, చాట్ చేయడం ఏమిటని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇప్పటికే వీడియో కాల్స్‌కు సంబంధించిన క్లిప్పింగులు బయటకు రావడంతో ఇరకాటంలో ఉన్న ఎమ్మెల్యేకు, ఈ తాజా వీడియో మరింత తలనొప్పిగా మారింది. వీణ చేస్తున్న ఆరోపణలతో రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తోంది. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఈ అంశాన్ని ఖండిస్తున్న విషయం విదితమే.

Read More.. ప్రయివేట్ హోటల్‌లో పవన్ కల్యాణ్ సమావేశం.. పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ..

Next Story