రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి

by Naga Rani Yarlagadda |

రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరో మహిళ మరణించింది. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది.

రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. కల్తీపాలు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి (72) అనే వృద్ధురాలు మరణించింది. ప్రస్తుతం మరో 10 మంది బాధితులు రాజమండ్రి, వైజాగ్ నగరాల్లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కల్తీపాలు, ఆ పాలతో చేసిన పదార్థాలు తీసుకున్నవారిలో అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్, అనూరియా వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలను ఫ్రీజ్ చేసిన సమయంలో లీకైన విషపూరిత రసాయనాల వల్ల బాధితుల అవయవాలు, ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్సకు కోలుకోవడం కష్టంగా మారినట్లు వైద్యులు వివరించారు.

Next Story