డీఎస్సీ అభ్యర్థులకు మరో తీపి కబురు.. కీలక ఉత్తర్వులు విడుదల

by Kema Shiva Kumar |

యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) 16,347 పోస్టులతో ఇటీవలే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (Mega DSC Notification) విడుదల చేసిన విషయం విదితమే.

డీఎస్సీ అభ్యర్థులకు మరో తీపి కబురు.. కీలక ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) 16,347 పోస్టులతో ఇటీవలే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (Mega DSC Notification) విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే డీఎస్సీకి దరఖాస్తు సమయం దగ్గర పడతోన్న వేళ ప్రభుత్వం అభ్యర్థులకు మరో తీపికబురు చెప్పింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బీఈడీ (BED)కి, టెట్‌ (TET)కు డిగ్రీలో 40 శాతం మార్కుల అర్హత ఉండగా.. డీఎస్సీ (DSC)కి 45 శాతం పెట్టడంపై అభ్యర్థులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆ అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకుని సర్కార్ డిగ్రీలో 40 శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా నిర్ణయం తీసుకుంది. ఇక జనరల్‌ అభ్యర్థులకు మాత్రం 50 శాతం మార్కలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, సిలబస్‌, అప్లికేషన్‌ లింక్‌, రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీలు వంటి పూర్తి వివరాలను అధికారులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌‌‌ https://apdsc.apcfss.in/లో పొందుపరిచారు. డీఎస్సీ పరీక్షలు జూన్‌ 6 నుంచి ప్రారంభమై జులై 6 వరకు కొనసానున్నాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

Next Story