- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబటి రాంబాబుకు మరో షాక్..ఏకంగా 3 కేసులు
అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. అతనిపై మూడు కేసులు పోలీసులు నమోదు చేశారట.

దిశ, వెబ్ డెస్క్: అర్ధరాత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. గుంటూరులోని ఆయన నివాసం వద్ద అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబటిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అంబటి రాంబాబుపై దాడికి టీడీపీ నేతలు యత్నం చేశారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద కార్లను తగలబెట్టారు.
అంబటిపై మూడు కేసులు
అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. అతనిపై మూడు కేసులు పోలీసులు నమోదు చేశారట. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గాను అంబటి రాంబాబుపై మూడు కేసులు నమోదు అయ్యాయి. నిన్న గుంటూరులో జరిగిన ఘటనపై పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అలాగే రోడ్డుపై కారు పార్కు చేయొద్దన్నందుకు దురుసుగా ప్రవర్తించారని ఎస్ఐ రామకృష్ణ ఫిర్యాదు నేపథ్యంలో మరో కేసు కూడా నమోదు అయింది. అటు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పల్నాడులో మరో టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఇలా మొత్తం మూడు కేసులు అంబటి రాంబాబుపై నమోదు అయ్యాయి.
Read More..






