Posani Krishna Murali:నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్!

by Jakkula.Mamatha |

APFDC మాజీ ఛైర్మన్(Former Chairman) పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali)కి మరో షాక్ తగిలింది.

Posani  Krishna Murali:నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్!
X

దిశ,వెబ్‌డెస్క్: APFDC మాజీ ఛైర్మన్(Former Chairman) పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali)కి మరో షాక్ తగిలింది. ఆయన తరపు న్యాయవాది రైల్వే కోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. రేపటి నుంచి ట్రైనింగ్‌కు వెళ్తున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి(శని, ఆదివారం) సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే సినీ ఫ్యాన్స్, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని నటుడు పోసాని పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా కోడూరు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్‌జైలుకు తరలించారు.

Next Story