టీటీడీలో మరో సంచలనం.. నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-19 05:39:50  IST  )

టీటీడీ (TTD)లో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay), బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీటీడీలో మరో సంచలనం.. నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ (TTD)లో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay), బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, బండి సంచలన వ్యాఖ్యలు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర అభ్యతరం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ టీటీడీ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. క్రిస్టియన్ మతాన్ని అనురిస్తున్నట్లుగా విజిలెన్స్ విభాగం రిపోర్టు ఇవ్వడంతో మొత్తం నలుగురు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. స్పస్పెన్షన్‌కు గురైన వారిలో నాణ్యతా విభాగ డిప్యూటీ ఇంజినీర్ బి.ఎలిజర్ (B.Eliezer), బర్డ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు ఎస్.రోసి, బర్డ్ ఆసుపత్రిలో గ్రేడ్-1 ఫార్మాసిస్ట్ ఎం.పేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వర్తిస్తున్న జి.అసుంత ఉన్నారు. అయితే, హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని అందుకే నలుగురు ఉద్యోగులపై వేటు వేసినట్లుగా సస్పెన్షన్ ఆర్డర్‌లో ప్రస్తావించారు.

Next Story