రాష్ట్రంలో మరో సంచలనం.. ఏకంగా CM చంద్రబాబుకు లీగల్ నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-24 04:41:18  IST  )

రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో మరో సంచలనం.. ఏకంగా CM చంద్రబాబుకు లీగల్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ పులివెందున సీఐ శంకరయ్య (CI Shankaraiah) ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu) లీగల్ నోటీసులు (Legal Notices) పంపాడు. ఆ నోటీసులలో వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. దీంతో ఆయన తరఫు న్యాయవాది జి.ధరణేశ్వర రెడ్డి (Dharaneshwar Reddy) నుంచి ఈనెల 18న సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు అందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, వివేకా హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందకు గాను రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్‌లో నోటీసులు ప్రస్తావించారు.

కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో భాగంగా నాడు పులివెందుల సీఐ‌గా జే.శంకరయ్య అండతో నిందితులు ఆధారాలను తారుమారు చేశారంటూ సీఎం చంద్రబాబు బహిరంగ వేదికలపై ప్రసంగించారు. అయితే, విధుల అలసత్వం వహించారని 2019లో శంకరయ్యను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వివేకా హత్యపై కేసు బుక్ చేయవద్దని, ఎంపీ అవినాష్‌ రెడ్డి (MP Avinash Reddy), అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి (Shiva Shankar Reddy) తనను బెదిరించారని సీఐ శంకరయ్య సీబీఐ (CBI ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా డెడ్‌బాడీని పోస్టుమార్టానికి పంపొద్దంటూ బెదిరింపులకు గురి చేశారని ఆయన సంచలన విషయాలను విచారణలో బయటపెట్టారు. అనంతరం వారం రోజుల వ్యవధిలోనే శంకరయ్యపై జగన్ సర్కార్ సస్పెన్షన్ ఎత్తేసింది. కేసులో కీలక నిందితులు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చారంటూ సీబీఐ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రాబాబుకు, సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story