మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-09 06:30:23  IST  )

అమరావతి రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ రెండు రోజుల క్రితం ఓ టీవీ డిబేట్‌లో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుతో పాటు కృష్ణంరాజుపై ఎన్టీఆర్‌ జిల్లా తెలుగు మహిళలు తుళ్లూరు పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస రావు (Kommineni Srinivasa Rao)ను ఇవాళ ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ రెండు రోజుల క్రితం ఓ టీవీ డిబేట్‌లో చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై ఎన్టీఆర్‌ జిల్లా తెలుగు మహిళలు, రాజధాని రైతులు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష శనివారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు (Tullur) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావును తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని ఉన్న ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టేందుకు కట్టుదిట్టమైన భద్రత నడుమ కొమ్మినేనిని విజయవాడకు తరలిస్తున్నారు.

Next Story