- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రప్రదేశ్‌లో మరో సంచలనం.. తునిలో అత్యాచార కేసు నిందితుడు గల్లంతు
కాకినాడ జిల్లా తుని (Tuni)లో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నారాయణరావుపై పోక్సో కేసు (POCSO case) నమోదు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా తుని (Tuni)లో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నారాయణరావు (Narayana Rao)పై పోక్సో కేసు (POCSO case) నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి తుని పోలీస్‌స్టేషన్ అతడిని నుంచి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా.. బహిర్భూమికి అని చెప్పి నిందితుడు నారాయణరావు పక్కనే ఉన్న కోమటిచెరువులో దూకేశాడు. ప్రస్తుతం గల్లంతైన అతడి కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.
కాగా, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నారాయణరావుపై పోక్సో కేసుతో పాటు కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా డీఎస్పీ శ్రీహరి రాజు (DSP Srihari Raju) వెల్లడించారు. ఈ కేసులో ఏ పార్టీ ప్రమేయం లేదని.. నిందితుడు కూడా ఇదే విషయాన్ని ప్రాథమిక విచారణలో వెల్లడించారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకు వీడియోలు సర్క్యులేట్ చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించిన వేళ నారాయణరావు చెరువులో గల్లంతు అవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
READ MORE ...
తుని అత్యాచారం కేసులో ట్విస్ట్.. నిందితుడు నారాయణరావు ఆత్మహత్య






