- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మరో సంచలనం.. బియ్యం అక్రమ రవాణా కేసులపై సిట్ ఏర్పాటు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో మరో సంచలనం నమోదు అయింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో సంచలనం నమోదు అయింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా(Ration Rice Smuggling)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కేసులన్నింటిని సిట్(SIT)కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ సిట్‌లో సమర్థవంతంగా పని చేసే ఐదుగురు అధికారులను నియమించింది. సిట్ చైర్మన్‌గా వినీత్ బ్రిజ్ లాల్(SIT ChairmanVineet Brij Lal) నియామకం అయ్యారు. రాష్ట్రంలో నమోదు అయిన రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులపై ప్రతి 15 రోజులకోసారి పురోగతిపై నివేదిక తయారు చేయనున్నారు. అనంతరం ప్రభుత్వానికి అప్పగించనున్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులకు సంబంధించి అన్ని వివరాలు, పూర్తి సమాచారాన్ని సిట్‌కు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీతో పాటు హోంసెక్రటరీని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story






