Amaravathi: రాజధానిలో మరో రూ.15,757 కోట్ల పనులు

by Thanuru Gopichand |

అమరావతి రాజధాని పనులను మూడేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

Amaravathi: రాజధానిలో మరో రూ.15,757 కోట్ల పనులు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : అమరావతి రాజధాని (Rajadhani) పనులను మూడేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిధుల కేటాయించేందుకు అనుమతులు శరవేగంగా ఇస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం అధ్యక్షతన 47వ సీఆర్డీయే అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు నారాయణ, పయ్యవుల కేశవ్​సీఆర్డీయే కమిషనర్, అధికారులు హాజరుకానున్నారు. రాజధానిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు సీఆర్డీయే అథారిటీ అనుమతి ఇవ్వనుంది. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపైనా నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే రూ.49,154 కోట్లకు అథారిటీ అనుమతి ఇచ్చింది. మరో రూ.15,757 కోట్ల విలువైన పనులక ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తంగా అమరావతిలో రూ.64,912 కోట్ల విలువైన పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story