Good News: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. త్వరలో కార్యకలాపాలు...!

by srinivas |   ( Updated:2025-01-23 11:56:40.0  )
Good News: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. త్వరలో కార్యకలాపాలు...!
X

దిశ, వెబ్ డెస్క్: విభజనతో అప్పుల ఊబిలో కూరుపోయిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) టీమ్ దావోస్(Davos) పర్యటనతో పరిశ్రమలు రాష్ట్రంవైపు చూస్తున్నాయి. వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్(Minister Nara Lokesh) భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువుగా ఉన్న పరిస్థితులను వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు సుముఖత చూపుతున్నారు.


తాజాగా కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌(Cognizant CEO Ravikumar)తో లోకేశ్ సమావేశం అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో అనువైన పరిస్థితులున్నాయని కంపెనీల ఏర్పాటుకు సహకరిస్తామని వివరించారు. తిరుపతి, విజయవాడ, విశాఖలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని తెలిపారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్టాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖ వంటి టైర్-2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిల్లో హైస్కిల్డ్ వర్క్ ఫోర్స్‌ తయారీకి రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందని వివరించారు. దీంతో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థలో పని చేస్తున్న 80 వేల మంది ఉద్యోగులను టైర్-1 నుంచి టైర్-2 పట్టణాలకు మార్చడానికి ప్రణాళికలు రూపొందించామని, ఇప్పటికే ప్రకటన కూడా చేశామని కాగ్నిజెంట్ సీఈవో స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. దీంతో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ త్వరలోనే కాగ్నిజెంట్ నుంచి ఏపీకి గుడ్ న్యూస్ లభించనుందని తెలిపారు.

Had a terrific meeting with the delightful


@imravikumars, CEO of technology giant @Cognizant.



Next Story

Most Viewed