- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ జనసేన అధ్యక్షుడికి మరో పదవి..
by Gantepaka Srikanth |
జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్న నేమూరి శంకర్ గౌడ్‌కు హిమాయత్ నగర్ టీటీడీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవి దక్కింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్న నేమూరి శంకర్ గౌడ్‌కు హిమాయత్ నగర్ టీటీడీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వం నియమించిన వివిధ దేవాలయాల అడ్వైజరీ కమిటీ చైర్మన్‌లలో ఆయనకు స్థానం లభించింది. గురువారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వివిధ దేవాలయాల అడ్వైజరీ కమిటీల్లో హిమాయత్ నగర్‌లోని టీటీడీ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా శంకర్ గౌడ్ స్థానం కల్పించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఆలయానికి సంబంధించిన అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా తనను నియమించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసంతో అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించిన పవన్ కల్యాణ్ విశ్వాసాన్ని నిలబెడతానని శంకర్ గౌడ్ తెలిపారు.
Next Story






