Tirumala Photo Shoot : శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫోటోషూట్ వివాదం

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-25 11:50:59  IST  )

తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple) ముందు మరోసారి ఫోటో షూట్ (Photo Shoot) వివాదం(Controversy)చోటుచేసుకుంది. బళ్లారి సిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫోటో షూట్ చేయడం వివాదం రేపింది.

Tirumala Photo Shoot : శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫోటోషూట్ వివాదం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple) ముందు మరోసారి ఫోటో షూట్ (Photo Shoot) వివాదం(Controversy)చోటుచేసుకుంది. బళ్లారి సిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫోటో షూట్ చేయడం వివాదం రేపింది. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బావమరిదికి హీరో నితిన్ మేనకోడలుతో నిన్న తిరుమలలో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చి తమ ఫోటోగ్రాఫర్లతో అక్కడ ఫోటోలు తీసుకున్నారు.

అక్కడే ఉన్న కొంత మంది శ్రీవారి ఆలయంలో ఫోటోషూట్‌లు చేయకూడదని..నిషేధితమని చెప్పినా వారు వినిపించుకోకుండా ఫోటో షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. శ్రీవారి ఆలయ మహా ద్వారం ముందు, గొల్ల మండపం ఎదురుగా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు కెమెరాలతో ఫోటోషూట్ చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక ప్రదేశం అని.. ఇక పై ఆలయ పరిసరాల్లో ఫోటో షూట్స్, రాజకీయ ప్రసంగాలు వంటివి వాటిని అనుమతించమని.. అలా చేసినవారిపై కొండ దిగేలోపు కేసు నమోదు అవుతుందని కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు ఇటీవలే హెచ్చరించింది. అయినప్పటికి శ్రీవారి ఆలయ సమీపంలో నారా భరత్‌ రెడ్డి కుటంబ సభ్యులు ఫోటో షూట్ చేయడం మరో వివాదాన్ని రగిల్చింది. కొండపై ఫోటో షూట్లు చాలాసార్లు వివాదస్పదంగా మారినప్పటికీ రాజకీయనాయకులు, ప్రముఖులు తిరిగి అదే తప్పు పదేపదే చేయడం పట్ల శ్రీవారి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధూరి జంట శ్రీవారి ఆలయం ముందు చేసిన ఫోటో షూట్, రీల్స్ పై కేసులు నమోదయ్యాయి. కొండపై ఫోటో షూట్ లు, సోషల్ మీడియా రీల్స్ వ్యవహారాలపై కూడా పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు.

Next Story