- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మరో కొత్త మండలం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు (Chandrababu) కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు (Chandrababu) కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఏపీలో కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు.. ఆలోచన చేస్తోంది. ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri Seetharamaraju District) ఉన్న.. వై రామవరం ( Y ramavaram) మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలని... ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ హామీని కూడా ఇచ్చారట. ఈ తరుణంలోనే ఈ అంశంపై టిడిపి నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నారట. ఎలాగైనా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతుంది.
దీనిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే దిశగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ కొత్త మండలం ఏర్పాటు చేయాలని అనుకుంటే.. వై రామవరం అప్పర్ ను ఒక మండలం గా అలాగే గుర్తేడు మరో మండలంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు. ఇదొక్కటే కాదు ఏపీలో ఒకటి నుంచి రెండు జిల్లాల ఏర్పాటుతో పాటు.. మరికొన్ని మండలాలు అదే సమయంలో రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.






