- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వంలో మరో కొత్త శాఖ
ఏపీ ప్రభుత్వం(AP Govt)లో మరో కొత్తశాఖ(New Deparetment)కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt)లో మరో కొత్తశాఖ(New Deparetment)కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రూపొందించే లక్ష్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం, అటవీ శాఖలో ఒక సబ్జెక్టుగా ఉన్నప్పటికీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, రీసెర్చ్, ఇన్నోవేషన్‌లను వేగవంతం చేసేందుకు దీనిని స్వతంత్ర శాఖగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జులై 19న అమరావతిలో సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ఈ ఆలోచనను వెల్లడించారు.
రాష్ట్రాన్ని 2030 నాటికి భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో SRM యూనివర్శిటీ-APని నోడల్ ఏజెన్సీగా నియమించనున్నారు. 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి సామర్థ్యం, 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తితో 25 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త శాఖ SRM యూనివర్శిటీ-APతో కలిసి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లు, టెస్టింగ్ ఫెసిలిటీస్, స్టార్టప్‌లకు మద్దతు, 2030 నాటికి 2,000 మంది నిపుణుల శిక్షణతో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడంతో పాటు, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలైన 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల నాన్-ఫాసిల్ ఇంధన ఉత్పత్తి, 2070 నాటికి నెట్-జీరో ఉద్గారాలకు ఐ నిర్ణయాలు దోహదపడనున్నాయి.






