AP Liquor scam : లిక్కర్​స్కాంలో మరోపేరు..!

by Thanuru Gopichand |   (  Updated:2025-04-22 05:48:50  IST  )

ఏపీ లిక్కర్​స్కాం మూలాలు కదులుతున్నాయి.

AP Liquor scam : లిక్కర్​స్కాంలో మరోపేరు..!
X

కొనసాగుతున్న కసిరెడ్డి విచారణ

ఎవరీ బల్లం సుధీర్​....?

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ లిక్కర్​స్కాం మూలాలు కదులుతున్నాయి.ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కసిరెడ్డిని (kasireddy) పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టిన తర్వాత పలు పేర్లు బయటకు వస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు. ఈవిచారణలో సిట్ చీఫ్‌తో పాటు ఏడుగురు అధికారుల బృందం ఉంది. అయితే వసూళ్ల నెట్‌వర్క్‌తో తనకు సంబంధం లేదని కసిరెడ్డి చెబుతున్నట్లు సమాచారం. గతంలో విజయసాయి, మిథున్ సిట్​ఎదుట ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. పలు ఆధారాలను చూపిస్తూ సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి బల్లం సుధీర అనే పేరు వచ్చింది. ఇతను కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. లావాదేవీలన్నీ సుధీర్ (Sudheer) ద్వారానే జరిపినట్టు సమాచారం. సుధీర్ ఎవరో కూపీ లాగే పనిలో ఉన్న సిట్ అధికారులు. ఏపీ, తెలంగాణలో ఇసుక మాఫియాలోనూ ఇద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది. కసిరెడ్డి, సుధీర్​ కలిసి వందల కోట్ల రూపాయలు వెనుకేసుకొన్నట్లు సమాచారం. ఈ లిక్కర్​ స్కాంలో కేసిరెడ్డి తర్వాత సుధీర్​దే కీలకపాత్ర​అని అంటున్నారు.

Next Story