Ap News: కూటమి ఖాతాలో మరో విజయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-15 09:23:05  IST  )

రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ కూటమి ఖాతాలోకి వెళ్లిపోయింది..

Ap News: కూటమి ఖాతాలో మరో విజయం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ కూటమి ఖాతాలోకి వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పీఠాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు వ్యూహాలు రచించింది. గత ఎన్నికల్లో భారీ విజయాలతో మేయర్, చైర్మన్లు, చైర్ పర్సన్ల, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులను దక్కించికున్న వైసీపీ... కూటమి నేతల దెబ్బకు విలవిలలాడుతోంది. వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూటమిలోకి దూకేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేషన్‌ను, మున్సిపాలిటీని పోగొట్టుకుంటోంది. ఇప్పటికే విశాఖ, తిరుపతి, గుంటూరుతో పాలు పలు పెద్ద కార్పొరేషన్లలో కూటమి జెండా ఎగిరింది. అవిశ్వాసం బాణం విసిరి పలు మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంది.

తాజాగా మడకశిర పంచాయతీలోనూ ఇదే వ్యూహాన్ని కూటమి అమలు చేసింది. దీంతో ఈ పీఠాన్ని సైతం టీడీపీ కైవసం చేసుకుంది. అవిశ్వాస తీర్మానంలో ఏకగ్రీవంగా టీడీపీ కౌన్సిలర్‌కు మద్దతు తెలిపారు. టీడీపీ కౌన్సిలర్ నరసింహరాజును కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అవిశ్వాస ఓటింగ్‌కు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. వైసీపీకి చెందిన చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాసం పెట్టారు. 14 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా, స్వచ్ఛందంగా పట్టణ 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజుకు మద్దతుగా నిలిచారు. ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంలో కౌన్సిలర్లతో పాటు నరసింహరాజుకు స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు మద్దతు తెలిపారు. మొత్తం 15మంది మద్దతుతో మడకశిర నగర పంచాయతీపై పసుపు జెండా రెపరెపలాడింది.

Next Story