- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD News : తిరుమలలో మరో అపచారం.. చర్యలకు దిగిన విజిలెన్స్
తిరుమల(Tirumala)లో మరో అపచారం(Misdeed) జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో మరో అపచారం(Misdeed) జరిగింది. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే ఈ అపచారానికి పాల్పడ్డారు. మద్యం(Alcohol) సేవించి తిరుమల కొండపైకి చేరడమే కాకుండా.. వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యారు. కాగా ఈ అపచారానికి, ప్రమాదానికి కారణం అయిన ముగ్గురు పోలీసులను TTD విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సాయంత్రం 6:30 గంటల సమయంలో తిరుమల గోపురం సమీపంలో జరిగింది. ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు.. స్వామి దర్శనం కోసం తమ వ్యక్తిగత వాహనంలో వచ్చి, మద్యం సేవించిన తర్వాత కర్ణాటక వాహనాన్ని ఢీకొట్టారు. విజిలెన్స్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బ్రీత్‌అలైజర్ టెస్ట్ చేయగా.. టెస్ట్‌లో మద్యం సేవించినట్టు నిర్దారించారు.
బ్రీత్‌అలైజర్ టెస్టులో ఏకంగా 300 పాయింట్లకు పైగా నమోదు కావడం గమనార్హం. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని, పోలీసులైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్ణాటక వాహనంలోని ఐదుగురు భక్తులు స్వల్పంగా గాయపడగా.. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.






