- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు
రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా ఏపీలో వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లా్ల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, ముఖ్యంగా నదులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయకూడదని తెలిపారు. అలాగే, సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, ఈనెల 18న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకావం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే ఈనెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.






