Vijayawada Metro Rail: కాంట్రాక్టు సంస్థలకు గుడ్‌న్యూస్.. ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మరో కీలక అప్‌డేట్

by Ramesh Naini |   (  Updated:2025-10-14 14:51:33  IST  )

ఏపీలోని కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది.

Vijayawada Metro Rail: కాంట్రాక్టు సంస్థలకు గుడ్‌న్యూస్.. ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మరో కీలక అప్‌డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (AP Metro Rail Corporation) ఏపీలోని కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. (Vijayawada Metro Rail Project) విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు టెండర్ల గడువును ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) మరో పది రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 24 వరకు గడువు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న కాంట్రాక్టు సంస్థలకు ఉపశమనం కలిగింది. విజయవాడ మెట్రో టెండర్ల కోసం ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థల అభ్యర్థన మేరకు APMRC గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

కాగా, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు లో రెండు కారిడార్లకు కలిపి ఒకే సింగిల్ టెండర్ విధానం ద్వారా ప్రక్రియను మెట్రో రైల్ కార్పొరేషన్ చేపట్టనుంది. సుమారు రూ. 4,500 కోట్ల వ్యయంతో టెండర్లను ఆహ్వానించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి దశలో చేపట్టే కారిడార్లు ఏమిటంటే..? గన్నవరం నుంచి పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌, పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకు 38.40 కిలోమీటర్ల దూరం, కారిడార్ల అంచనా వ్యయం రూ.11,009 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భూసేకరణ ఖర్చు.. రూ.1,152 కోట్లు.. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఇక, రెండో దశలో చేపట్టే కారిడార్‌లు ఏమిటంటే..? పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి అమరావతి వరకు 27.75 కిలోమీటర్ల దూరం ఏర్పాటు చేయనున్నారు.

Next Story