వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీత పిటిషన్‌‌పై విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు లోతుగా సాగలేదని, అసలు నిజాలు బయటకు రావాలంటే మరింత సమగ్ర విచారణ అవసరమని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీత పిటిషన్‌‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Former Minister YS Vivekananda Reddy Murder Case)లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు(CBI investigation) లోతుగా సాగలేదని, అసలు నిజాలు బయటకు రావాలంటే మరింత సమగ్ర విచారణ అవసరమని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి(Sunita Reddy) సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ మూడు ఛార్జ్‌షీట్‌లను దాఖలు చేసినప్పటికీ, లోతైన దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు.

ఈ పిటిషన్‌పై..

అయితే సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు స్పందించింది. పిటిషన్ కాపీలను నిందితులందరికీ అందజేయాలని ఆదేశించింది. నిందితుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

Next Story