అమరావతికి రూ.7,500 కోట్ల రుణం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-28 12:00:05  IST  )

అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది.....

అమరావతికి రూ.7,500 కోట్ల రుణం..  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రూ. 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్ఏబీఎఫ్ఐడీ(NABFID) నుంచి రుణం(Loan) తీసుకోవాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 7,500 కోట్లు తీసుకునేందుకు హామీ ఇచ్చింది. అలాగే ఉత్తర్వులు సైతం జారీ చేసింది.


ఎన్ఏబీఎఫ్ఐడీ నుంచి తీసుకున్న రుణాన్ని రాజధాని అమరావతి అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన పెట్టింది. తదుపరి చర్యలు చేపట్టాలని సీఆర్డీఏ(CRDA) కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story