విశాఖలో మరో కీలక మైలురాయి.. మంత్రి నారా లోకేశ్ హర్షం

by Vemula.Srinu Prasad |

ఏపీని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు....

విశాఖలో మరో కీలక మైలురాయి.. మంత్రి నారా లోకేశ్ హర్షం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ(Governemrnt) లక్ష్యమని, ఇందులో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించిందని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh ) అన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఐటీ రంగంలో ఒక మహత్తర ముందడుగని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలపాలనే తపన ప్రతిరోజూ తమను ఆశ్చర్యపరుస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

"వెల్‌కమ్ టు వైజాగ్ ఐబీఎం" అంటూ మంత్రి స్వాగతం

ప్రపంచ ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) విశాఖపట్నంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుండటంపై ఆనందం వ్యక్తం చేసిన లోకేష్ "వెల్‌కమ్ టు వైజాగ్ ఐబీఎం" అంటూ సోషల్ మీడియా వేదికగా స్వాగతం పలికారు. ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ రాకతో విశాఖకు మరిన్ని ఐటీ పెట్టుబడులు వస్తాయని, తద్వారా నగరం అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఉత్తరాంధ్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని నారా లోకేష్ తెలిపారు.

ఐటీ రంగానికిచిరునామాగా విశాఖ

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. ఐటీ రంగానికి విశాఖపట్నం చిరునామాగా మారుతుంటే, అత్యాధునిక క్వాంటం టెక్నాలజీతో అమరావతి గ్లోబల్ సెంటర్‌గా ఎదుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా #ChooseSpeedChooseAP అనే హ్యాష్‌ట్యాగ్‌తో లోకేష్ తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఏపీ అభివృద్ధి బాటలో వేగంగా దూసుకుపోతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

Next Story