Breaking: ఏపీలో మరో కీలక మావోయిస్టు లొంగుబాటు

by Vemula.Srinu Prasad |

ఏపీలో మరో కీలక మావోయిస్టు లొంగుబాటు కలకలం రేపింది..

Breaking: ఏపీలో మరో కీలక మావోయిస్టు లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టుల(Maoists)పై ఆపరేషన్ కగార్(Operation Kagar) ప్రభావం తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లకు బలిఅవుతుంటే.. మరికొందరు లొంగిపోతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల లొంగుబాటు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఆంధ్రాలో లొంగుబాటులు నమోదు అవుతున్నాయి. మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌‌తో ఈ రాష్ట్రంలోనూ లొంగుబాటులు పెరుగుతున్నాయి. తాజాగా అల్లూరి జిల్లా ఎస్పీ ఎదుట నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు ముచకి నందా లొంగిపోయారు.

ఈ సందర్భంగా మావోయిస్టులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌(Hidma encounter)లో తప్పించుకున్న మావోయిస్టులు AOBలో షెల్టర్‌ తీసుకున్నారని తెలిపారు. దండకారణ్యంలో విస్తృతంగా కూంబింగ్‌ జరుగుతోందని చెప్పారు. సానుభూతి కోసం మావోయిస్టు పార్టీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఆయుధాలతో సరెండర్‌ కావాలని మావోయిస్టులను కోరుతున్నామని పోలీసులు పిలుపునిచ్చారు.

Next Story