విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

by srinivas |   ( Updated:2025-04-14 14:55:52.0  )
విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో వైసీపీ(Ycp)కి బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం(Visakhapatnam West Constituency) వైసీపీ నేత, మండల అధ్యక్షుడు బెహరా భాస్కరరావు గత ఎన్నికల్లో స్థానిక వైసీపీ అభ్యర్థి కోసం కీలకంగా పని చేశారు. కానీ ఓడిపోవడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అటు వైసీపీ అభ్యర్థి సైతం భాస్కరరావుకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించడలేదనే ప్రచారం జరుగుతోంది.

ఇందుకు తోడు విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో విశాఖ ఉమ్మడి నగరంలో కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. ఈ పరిణామాలతో విశాఖలో పార్టీ బలహీనపడినట్లు భాస్కరరావు భావించారు. ఈ మేరకు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధినేత జగన్‌‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నానని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులకు సైతం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.



Next Story