మావోయిస్టులకు మరో షాక్.. అరెస్టైన వారందర్నీ కస్టడీకి కోరుతున్న పోలీసులు

by Vemula.Srinu Prasad |

ఆపరేషన్ కగార్‌లో అరెస్టైన మావోయిస్టుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.....

మావోయిస్టులకు మరో షాక్.. అరెస్టైన వారందర్నీ కస్టడీకి కోరుతున్న పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ కగార్‌(Operation Kagar)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ(Vijayawada)లో భారీగా మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారిలో నలుగురిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు వారంపాటు కస్టడీకి ఇవ్వాలని బెడవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం సోమవారం విచారించనుంది.

మరోవైపు కృష్ణా జిల్లా(Krishna District)లో అరెస్ట్ అయిన 28 మంది మావోయిస్టులను సైతం కస్టడీకి ఇవ్వాలని కోరేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మూడు దఫాలుగా వారందరిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు. మొదట 10 మందిని విచారించేందుకు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Next Story