- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి గుడ్ న్యూస్.. రేషన్ పంపిణీ పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
రాష్ట్రంలో రేషన్ పంపిణీ పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేషన్ పంపిణీ పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రేషన్ పంపిణీ విధానంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తున్నారు. దివ్యాంగుల, వృద్ధులకు మాత్రం ఇంటికే పంపిణీ చేస్తున్నారు. ఇక, రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి వాటికి సరిపడా కందిపప్పు, మంచి నూనె, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా వృద్ధులు, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సరుకుల పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5 వరకు ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో 26 నుంచి 30 తేదీల్లో ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జులై నెల రేషన్‌ను ఈ నెల(జూన్) 26 నుంచి ఇంటికే అందించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద ఇచ్చారు. అటు సన్న బియ్యం పండించేలా రైతులను ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) కోరారు.






