ఏసీబీ వలలో మరో ప్రభుత్వ ఉద్యోగి

by Vemula.Srinu Prasad |

ఏసీబీ వలకి మరో ప్రభుత్వ ఉద్యోగి దొరికారు....

ఏసీబీ వలలో మరో ప్రభుత్వ ఉద్యోగి
X

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(ACB) వలకి మరో ప్రభుత్వ ఉద్యోగి దొరికారు. లంచం తీసుకుంటూ అధికారులకు కైకలూరు సబ్ ట్రెజరీ కార్యాలయం అసిస్టెంట్ హనుమంతరావు(Kaikaluru Sub Treasury Office Assistant Hanumantha Rao) చిక్కారు. కార్యాలయంలో పని కోసం వచ్చిన వ్యక్తిని హనుమంతరావు రూ. 22 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు సబ్ ట్రెజరీ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా హనుమంతరావును అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శాఖా పరమైన చర్యలకు ఆదేశించారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story