- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలోని ఈ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 40 ప్రాజెక్టులకు కేంద

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 40 ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 1067 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణరాయ దేవరాలు స్పష్టం చేశారు. అర్బన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కార్పొరేషన్ లకు ఈ నిధులు విడుదల చేసినట్లు వివరణ ఇచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు.
ప్రాథమికంగా తొలి విడతలో మొత్తం 422 కోట్ల రూపాయలు కేటాయించింది అని గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని పలుసార్లు అడగడంతో... మొత్తం 40 ప్రాజెక్టులకు గాను 1067 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కేంద్రాన్ని మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... కూటమి ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం లో.. బిజెపి కూడా భాగస్వామ్యం అయింది. మోడీ ప్రభుత్వం ఏపీకి అండగా నిలుస్తున్నారు. ఎక్కువ శాతం లో నిధులు కేటాయిస్తున్నారు. వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.






