- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘అన్నదాత సుఖీభవ’పై సర్కార్ కీలక ప్రకటన
రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టబడి సాయం అందించి వారిక ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కూటమి సర్కార్ ఇటీవలే ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టబడి సాయం అందించి వారిక ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కూటమి సర్కార్ ఇటీవలే ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి శ్రీకారం చుట్టింది. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకంలో భాగస్వాములు కానున్నారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు.. మొత్తం మూడు విడతలుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం (PM Kisan Yojana Scheme) ద్వారా వచ్చే రూ.6 వేలకు గాను మరో రూ.14 వేలు కలిపి మొత్తం ఏటా రూ.20 వేలు రైతులకు పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకం (‘Annadhatha Sukhibhava’ scheme) కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఈ-కేవైసీ (E-KYC) పూర్తైన రైతులకు పెట్టబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Kinjarapu Achennaidu) వెల్లడించారు. విడతల వారీగా డబ్బులు జమ చేస్తామని రైతులు ఎవరూ తమ ఖాతాలో డబ్బు పడలేదని నిరుత్సాహ పడొద్దని కామెంట్ చేశారు. రాష్ట్రంలో యూరియా సరఫరా చేస్తున్నామని పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామన అన్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.






