GBS : రాష్ట్రంలో మరో GBS మరణం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో జీబీఎస్(GBS) మరణ మృదంగం మోగుతోంది.

GBS : రాష్ట్రంలో మరో GBS మరణం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జీబీఎస్(GBS) మరణ మృదంగం మోగుతోంది. ఈ వ్యాధి బారిన పడి ఏపీ(AP)లో మరో మహిళ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్(Guntur GGH) లో బుధవారం షేక్ గౌహర్ జాన్ అనే మహిళ కన్నుమూసింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత పెరిగి ఈరోజు సాయంత్రం మరణించింది. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్ తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు భయంతో వణికి పోతున్నారు. మరోవైపు ఏపీలో జీబీఎస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది అంటువ్యాధి కాదు అని అధికారులు, వైద్యులు చెప్పినప్పటికీ ప్రజల్లో కరోనా తాలూకు భయం వీడటం లేదు. ఈ వ్యాధి లక్షణాలతో ఎవరైనా బాధపడితే వెంటనే పరీక్షలు చేయించుకొని, చికిత్స చేయించుకోవాలని.. ఆలస్యం చేయకూడదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Next Story