AB Venkateshwara Rao : రాజకీయాల్లోకి మరో మాజీ ఐపీఎస్

by Muthe.Rajitha |   (  Updated:2025-04-13 15:03:58  IST  )

రాజకీయాల్లోకి మరో మాజీ ఐపీఎస్ అడుగు పెట్టనున్నారు.

AB Venkateshwara Rao : రాజకీయాల్లోకి మరో మాజీ ఐపీఎస్
X

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయాల్లోకి మరో మాజీ ఐపీఎస్ అడుగు పెట్టనున్నారు. ఏపీ మాజీ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వరరావు(AB Venkateshwara Rao) కీలక ప్రకటన చేశారు. అమలాపురంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ప్రజల హక్కులను కాపాడటం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపిన ఆయన.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) పై పలు విమర్శలు చేశారు. ఐదేళ్లలో జగన్ తీవ్ర ఆర్థిక విధ్వంసం సృష్టించిందని, రాష్ట్రాన్నిఇంకో పదేళ్ళ పాటు కోలుకోలేని దెబ్బ తీసిందని మండిపడ్డారు. జగన్ వల్ల ఏపీకి పెను ప్రమాదం పొంచి ఉన్నదని, అన్యాయాలు అక్రమాలు చేసేవారికి ఆ పార్టీలో పెద్ద పీట వేస్తారని ఆరోపించారు. జగన్ తన స్వార్థం కోసం కోడి కత్తి శ్రీను జీవితాన్ని చిదిమేశారని.. జగన్ బాధితులకు తాను అండగా ఉంటానని, ఆయన చేసిన అన్యాయాలు బయట పెడతానని ఏబీ వేంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Next Story