- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో బాణసంచా పేలుడు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు
by Vemula.Srinu Prasad |
వేట్లపాలెం పేలుడు ఘటన మర్చిపోకముందు రాష్ట్రంలో ఇదే తరహా ఘటన మరోచోట భయాందోళనలను కలిగించింది. అయితే ఇక్కడ సకాలంలో మంటలార్పడం, ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: వేట్లపాలెం పేలుడు(Vetlapalem explosion) ఘటన మర్చిపోకముందు రాష్ట్రంలో ఇదే తరహా ఘటన మరోచోట భయాందోళనలను కలిగించింది. అయితే ఇక్కడ సకాలంలో మంటలార్పడం, ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నంలో జరిగింది. గోపాలపట్నం రజకవీధిలో ఒక్కసారిగా బాణసంచా పేలుడు చోటు చేసుకుంది. అయితే కొందరు స్థానికులు అప్రమత్తమయ్యారు. సకాలంలో మంటలార్పారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది
ఈ ఘటనతో..
అయితే ఈ ఘటనతో మరికొందరు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలం నుంచి దూరంగా పరుగులు తీశారు. జనావాసాల మధ్య పెద్ద ఎత్తున బాణసంచా తయారీ చేస్తుండంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గోపాలపట్నం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story






