- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింఛన్ సొమ్ముతో మరొక ఉద్యోగి జంప్
పింఛన్ల సొమ్ముతో మరొక ఉద్యోగి పరారయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: పేదలకు పంచాల్సిన పింఛన్ సొమ్ము(Pension Money)పై కొందరు ఉద్యోగులకు వ్యామోహం పెరుగిపోతోంది. నెల ప్రారంభంలో పింఛన్లు పంచేందుకు డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్నారు. పేదలకు డబ్బులు సాయం చేసి వారికి అండగా నిలవాలన్న ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. అందినకాడికి డబ్బులు తీసుకుని పరారవుతున్నారు. ఏ పని చేసుకోలేని వాళ్ల డబ్బులను అన్యాయంగా ఎత్తుకెళ్లిపోతున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల ఏదో ఒక చోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా చిత్తూరు జిల్లా(Chittoor) పుంగనూరు మండలం బండ్లపల్లి(Bandapalli)లో లబ్దిదారులకు సామాజిక పింఛన్లు అందలేదు. ఇందుకు కారణం ఆ డబ్బులను తీసుకుని ఉద్యోగి పారిపోవడమే. మొత్తం రూ.6.34 లక్షల నగదుతో సచివాలయ సెక్రటరీ శ్రీనివాసులు పరారీ అయ్యారు. దీంతో ఎంపీడీఓ లీలా మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్వరగా పట్టుకోవాలని కోరారు.
ఇదే తరహా ఘటన సెప్టెంబర్ 1న (సోమవారం) కూడా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా చండ్రేడులో రూ. 2,13,500ను డబ్బులను పంపిణీ చేయకుండా సచివాలయ ఉద్యోగి పరార్ అయ్యారు. ఈ ఘటన మరువకముండే మరోసారి జరగడం సంచలనంగా మారింది.






