Ap News: మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. మార్చి 6న నోటిఫికేషన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-27 16:28:29  IST  )

ఏపీలో మరో ఎన్నికలకు నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ..

Ap News: మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. మార్చి 6న నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో ఎన్నికలకు నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 14న పరిశీలించనున్నారు. 23న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు నారా లోకేశ్, భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెను మత్స సూర్య నారాయణరాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story