- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో డిజిటల్ అరెస్ట్.. ఈసారి రూ.48 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
రాష్ట్రంలో మరో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది. ఈసారి రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేశారు. ఉన్నపళంగా తమను అరెస్ట్ చేయబోతున్నామని, రూ. 48 లక్షలు ఇవ్వాలని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన జెంజిమెన్‌కు ఫోన్ చేశారు. దీంతో ఆయన డబ్బులు సమర్పించుకున్నారు. తీరా మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. రూ.32 లక్షలు, 25 ఏటీఎం కార్డులు, మూడు సెల్ ఫోన్స్, నాలుగు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 7.65 లక్షలను ఫ్రీజ్ చేశారు.
అయితే డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రభుత్వం మాజీ, ప్రస్తుత ఉద్యోగులకు తాము ఉన్నతాధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే వెంటనే తమను సంప్రదించాలని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని, భయపడొద్దని పిలుపునిచ్చారు.






