- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ పాల ఘటనలో మరో మరణం.. ఆస్పత్రిలో మహిళ మృతి
కల్తీ పాల ఘటన లో మరో మరణం నమోదు అయింది. రాజమండ్రి సిటీ పరిధిలోని రెండు కాలనీల్లో కల్తీ పాలు తాగి 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొకరు చనిపోయారు...

దిశ, వెబ్ డెస్క్: కల్తీ పాల ఘటన(Adulterated milk incident)లో మరో మరణం నమోదు అయింది. రాజమండ్రి(Rajahmundry) సిటీ పరిధిలోని రెండు కాలనీల్లో కల్తీ పాలు తాగి 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొకరు చనిపోయారు. కల్తీ పాలు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణవేణి ఆస్పత్రి(Krishnaveni Hospital)లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో ఈ మరణంతో ఇప్పటివరకూ మొత్తం 9 మంది చనిపోయారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 మందిని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. వారి పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా తమ వాళ్లు ఆరోగ్యంగా డిశ్చార్జి కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఈ కల్తీ పాల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పాలు సరఫరా చేసిన డెయిరీ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో మరో మరణం నమోదు కావడం క్షతగాత్రుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తుంది.






