- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో తుఫాను
కొద్ది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దాని ప్రభావం నుంచి ఏపీ, తెలంగాణ ఇప్పుడే కోలుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కొద్ది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దాని ప్రభావం నుంచి ఏపీ, తెలంగాణ ఇప్పుడే కోలుకున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో వచ్చే వారం తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు (Meteorologists) అంచనా వేశారు. ఈ నెల 22న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడటానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని వారు తెలిపారు. ఆ అల్పపీడనం బంగాళాఖాతంలో బలపడుతూ పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి, ఆంధ్రప్రదేశ్–తమిళనాడు తీరాల వైపుకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నవంబర్ 24 నుంచి 30 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని, దాని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బలమైన గాలులు, రవాణా అంతరాయాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రభుత్వ విభాగాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.






