Ex Minister Rajani: మాజీ మంత్రి రజినిపై మరో ఫిర్యాదు

by Thanuru Gopichand |   (  Updated:2025-03-28 06:07:34  IST  )

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది.

Ex Minister Rajani: మాజీ మంత్రి రజినిపై మరో ఫిర్యాదు
X

తన ఇంటిపై దాడి చేశారని ఓ వ్యక్తి ఆరోపణ

గతంలో తాను పెట్టిన కేసును విచారించాలి..

పోలీసులను ఆశ్రయించిన రావు సుబ్రహ్మణ్యం

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. గతంలో ఆమె అక్రమాలను ప్రశ్నించిందుకు తన ఇంటిపై దాడి చేశారని, తన కుటుంబాన్ని మానసికంగా హింసించారని చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే స్టోన్​క్రషర్స్​యజమానిని బెదిరించి డబ్బుగుంజారనే ఆరోపణలతో రజిని, మరో నలుగురిపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. ఆ కేసులో రజిని ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఆ కేసు విచారణకు రాగా న్యాయస్థానం విచారణ ఏప్రిల్‌ 2కి వాయిదా వేసింది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్స్‌కు చెందిన నల్లపనేని చలపతిరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈకేసు నమోదు చేశారు. తాజాగా ఆమెపై మరో ఫిర్యాదు అందడం కలకలం రేకెత్తిస్తోంది. 2022 ఏప్రిల్​లో రజిని మనుషులు తన ఇంటిపైకి వచ్చి దాడి చేశారని, ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే తాను ఫిర్యాదు చేయగా.. నామమాత్రంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. రజిని, ఆమె మరిది గోపిపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో రజిని చిలకలూరిపేట నియోజకవర్గంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల సమయంలో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ పోటీ చేయించగా.. అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ నేపథ్యంలో అదే నియోజకవర్గానికి చెందన మర్రి రాజశేఖర్​తన వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆరోపణలు చేశారు. ఎంపీ కృష్ణదేవరాయలు సైతం రజినిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని తన తోటి నాయకులతోనే ఆమెకు రాజకీయాల్లో సఖ్యత లేదని సమాచారం. ఈ క్రమంలో రజినిపై వరుస కేసులు నమోదవుతుండడం చర్చనీయాంశమైంది.

Next Story