- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Posani KrishnaMurali : పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదు
సినీనటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)ని బుధవారం పోలీసులు అరెస్ట్(Arest) చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : సినీనటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)ని బుధవారం పోలీసులు అరెస్ట్(Arest) చేసిన విషయం తెలిసిందే. కాగా నేడు ఓబులవారిపల్లె పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లకముందే పోసానిపై మరో కేసు నమోదు అయింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్లో పగడాల వెంకటేష్ అనే వ్యక్తి ఈనెల 20న పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈరోజు ఆయనపై బిఎన్ఎస్(BNS) యాక్ట్ 195, 114, 75, 79 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఓబులవారిపల్లె పీఎస్(Obulavaripalle PS) లో పోసాని విచారణ కొనసాగుతోంది. ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 4 గంటలుగా కొనసాగుతున్న విచారణలో పోసాని విచారణకు సహకరించడం లేడని సమాచారం. ఏ ఒక ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పడం లేదని పోలీసులు తెలియజేశారు.






