- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకొని పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా బస్సు ప్రమాదాలు (Bus accidents) చోటు చేసుకొని పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై 19 మంది సజీవ దహనం అయిన ఘటన మరువక ముందే చేవెళ్ల మండలం మిర్జాగడాలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మంగళవారం ఒక్కరోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదు బస్సు ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ వరుస ప్రమాదాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటుండగా.. మరో బస్సు ప్రమాదం జరిగి మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.
ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC bus) విశాఖ పట్టణం నుంచి జైపూర్ కు వెళ్తుంది. ఈ క్రమంలో మన్యం జిల్లాలోని పార్వతీపురం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపేసి.. ప్రయాణికులను అలర్ట్ చేశాడు. దీంతో బస్సులో ఉన్న వారంతా వేగంగా కిందకు దిగిపోయారు. అనంతరం క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు చెలరేగి.. పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పి.. ప్రయాణికులు మొత్తం ప్రాణాలతో బయటపడ్డారు.






