Big Twist: పల్నాడు రోడ్డు ప్రమాద ఘటనలో మరో బిగ్ ట్విస్ట్..

by Ramesh Naini |

ల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద మూడు రోజుల క్రితం జరిగిన భయానక రోడ్డు ప్రమాదం మరో సంచలన మలుపు తిరిగింది.

Big Twist: పల్నాడు రోడ్డు ప్రమాద ఘటనలో మరో బిగ్ ట్విస్ట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద మూడు రోజుల క్రితం జరిగిన భయానక రోడ్డు ప్రమాదం మరో సంచలన మలుపు తిరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు స్పాట్‌లోనే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారంతా మాలలోకి చెందినవారే కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. తాజాగా పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఒక కారు అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసినట్లు విచారణలో బయట పడింది. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న విద్యార్థుల కారు ఆ కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

కంటైనర్‌కు అడ్డుపెట్టిన కారులో ఉన్న వ్యక్తి ఓ ఏఎస్ఐ కుమారుడు అని, అతడు తన గ్యాంగ్‌తో కలిసి బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌లా వ్యవహరిస్తూ హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. కంటైనర్‌ను పక్కకు ఆపించాలని అతడు సైగ చేయడంతో లారీ వేగం తగ్గించగా, వెనుక నుంచి వచ్చిన విద్యార్థుల కారు అదుపు తప్పి భయంకరంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణమైన ఏఎస్ఐ కుమారుడిని చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణను వేగవంతం చేశారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు.

Next Story